పట్టణాల్లోనూ పారిశుద్ధ్య చర్యలు పెంచాలి: మంత్రి కేటీఆర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు  పట్టణాల్లో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.  కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పురపాలకశాఖకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. 'అన్ని పట్టణాల్లో పారిశుద్ధ్య చర్యలు పెంచాలి. రహదారుల మరమ్మతులు వేగవంతం చేయాలి. రూ.5 భోజన కేంద్రాలు అన్నీ పనిచేసేలా చూడాలి. ఆవాసం లేని వారిని రాత్రి షెల్టర్లకు తరలించాలి. హోం క్వారంటైన్‌లో ఉన్న వారందరినీ పర్యవేక్షించాలని' కేటీఆర్‌ సూచించారు. కరోనా వైరస్‌ అంతమయ్యే వరకూ స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందేనని, డాక్టర్ల సూచనలను అందరూ తప్పక పాటించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.